Breaking News

కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీ పార్టీలో చేరిక.

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

నర్సంపేట నియోజకవర్గం,నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన జక్కోజు కృష్ణ, కొండ్లె శ్రావణ్, మంద లోకేష్, త్రికోవెల గోవర్ధన్ లు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని గ్రహించి బిజెపి పార్టీలో చేరుతున్నారన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో యువకులకు ఎక్కువ ప్రాధ్యానత కల్పిస్తూ,వారిని ప్రజా ప్రతినిధులను చేస్తానని అన్నారు..స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామ అభివృద్ధి సాధ్యమైతుందన్నారు.స్థానిక ఎన్నికల్లో నిలబడుతున్న అభ్యర్థుల గెలుపుకై సైనికుల్లా ప్రతి కార్యకర్త పని చెయ్యాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,జిల్లా నాయకులు పెరుమాండ్ల కోటి,సీనియర్ నాయకులు కొండ్లె రమేష్,
తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..