బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

పట్టణంలో ఘనంగా కేసీఆర్ దీక్ష దివాస్

తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన చారిత్రక దినం..

బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

పట్టణంలోని అమరవీరుల స్థూపం దగ్గర బిఆర్ఎస్ శ్రేణులు దీక్ష దివాస్ కార్యక్రమం ను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ… తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో” అని నినదించి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు ఇది.
తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం, యావత్ తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష.తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివస్ నిలుస్తుంది.
2009 నవంబర్ 29వ తేదీన భారత రాష్ట్ర సమితి (అప్పటి టీఆర్ఎస్) అధ్యక్షులు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి, స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసింది.దీక్షకు వెళ్లే ముందు “తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో” అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజలను ఏకం చేసింది.
సమగ్ర భారత దేశ రాజకీయ వ్యవస్థను కదిలించి, దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చింది.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి.. కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ కలిపిన సందర్భం దీక్షా దివస్.ప్రత్యేక తెలంగాణ కళ కలగానే మిగిలిపోతుందేమో అన్న సమయంలో, అమరవీరుల నెత్తురుతో వారి త్యాగాలతో తెలంగాణ నేల తడిసి ముద్దవుతున్న సమయంలో ఎత్తిన జెండా విడవకుండా, పదవులను గడ్డి పోచాల్లా విసురుతూ తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర నినాదం ఇంకా బలంగానే ఉందని అనేకసార్లు నిరూపించి త్యాగాలకు త్రొవ్వచూపిన తీరు చరిత్ర పుటల్లో పదిలం పదిలం..
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్,పట్టణ పార్టీ అధ్యక్షులు,మాజీ ఎంపీపీ,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్,జిల్లా నాయకులు, మాజీ కాన్సిలర్లు,పట్టణ కమిటీ బాధ్యులు,అనుబంధ సంఘాల నాయకులు,యూత్ నాయకులు,మహిళా అధ్యక్షురాలు,మహిళా కమిటీ బాధ్యులు,అన్ని అనుబంధ సంఘాల నాయకులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..