Breaking News

ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది వివాహిత ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్:

ఓ వివాహిత ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన కేశవాపూర్ జమ్మికుంట లో చోటు చేసుకుంది.గంగారపు చంద్రయ్య ఫిర్యాదు మేరకు ఈ వివరాలు వెల్లడయ్యాయి. చంద్రయ్య తన పెద్ద కూతురు పాతకాల విజయరాణిని 16 సంవత్సరాల క్రితం జమ్మికుంటలోని కేశవాపూర్‌కు చెందిన కిరణ్ కుమార్ ఇచ్చి వివాహం చేశారు. కిరణ్ కుమార్ పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు.కిరణ్ కుమార్ సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోకపోవడంతో విజయరాణి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ, మనస్తాపానికి గురయ్యేవారు.ఈనెల 27న, ఫిర్యాది చంద్రయ్య, అతని భార్య కేశవాపూర్‌లోని కూతురి ఇంటికి వచ్చారు. ఈనెల 28 రోజున ఉదయం సుమారు 9 గంటలకు, గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.వెంటనే ఆమెను హుజురాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జమ్మికుంటలోని విజయసాయి హాస్పిటల్‌కు తీసుకొచ్చారు.చికిత్స పొందుతూ విజయరాణి మరణించింది. తన కూతురు కేవలం ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురై ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని ఫిర్యాది చంద్రయ్య పోలీసులకు తెలిపారు.పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..