Breaking News

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

కొడకండ్ల మండలంలోని ఏడునూతన గ్రామానికి చెందిన భాదిత కుటుంబాలను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పరామర్శించారు.మంగళవారం ఏడువతుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కీసర సునీల్ రెడ్డి తల్లి కమలాదేవి (70) ఆకస్మికంగా మరణించగా కమలాదేవి భౌతికాయంపై ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామానికి చెందిన దూది గాని వరలక్ష్మి (40) బొల్లోజు (45)నరసింహ చారి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఆమె వెంట మండల పార్టీ అధ్యక్షుడు సురేష్ నాయక్, కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈ రెంటి సాయి కృష్ణ, వెంగళరావు తదితరులు ఉన్నారు

జర్నలిస్టులకు వ్యక్తిగతంగానే ఇండ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క