ఖండించిన భద్రాద్రి జిల్లా జర్నలిస్టులు…
మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో మంగళవారం సీఎం పర్యటన సందర్భంగా మంగళవారం ఉదయం టీయూడబ్ల్యూజే ఐజేయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ ను కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.. దీంతో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు అక్రమ అరెస్టులపై నిరసన తెలిపేందుకు జర్నలిస్టులు పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు. టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, ఇందిరమ్మ ఇండ్లు హెల్త్ కార్డులు కోసం గతంలో సీఎం చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామానికి వచ్చిన సందర్భంలో నిరసన తెలిపారు. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న క్రమంలో ఉదయ్ కుమార్ ను ముందస్తు అరెస్టు చేశారు.. ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో దిగివచ్చిన పోలీసులు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో టీయూడబ్ల్యూజే ఐజేయు భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం టి యు డబ్ల్యూ జే ఐ జేయు నిరంతరం పోరాటం చేస్తుందని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గదని అరెస్టులతో ఉద్యమాన్ని అణచలేరని హెచ్చరించారు. కార్యక్రమంలో ఈశ్వర్, ఏర్పుల సుధాకర్, లక్ష్మణ్, సైదులు, పొన్నం ఉపేందర్ నాయుడు,కోలా కుమార్, సత్యనారాయణ, కొండా జంపన్న, కిరణ్ కుమార్, చదలవాడ సూరి మురళి కృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

