మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి:
లింగంపేట మండలం మిద్ద గట్టు వద్ద కే కే వై ప్రధాన రహదారి పక్కనే ఉన్న చిరుత ను ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులు వీడియోలు తీసిన సంఘటన కాసేపటి క్రితం చోటుచేసుకుంది. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వస్తున్న ఆర్టీసీ బస్సు లింగంపేట మండలం మిద్ద గట్టు వద్ద చిరుత పులిని గమనించిన ఆర్టీసీ డ్రైవర్ బస్సును ఆపివేయగా బస్సులో ఉన్న ప్రయాణికులు ఇది గమనించి వారి మొబైల్ ఫోన్లలో చిరుత కదలికలను వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అన్ని వాట్స్అప్ గ్రూప్ లలో చెక్కర్లు కొడుతుంది. కాగా రెండు రోజుల క్రితం మెంగారం గ్రామం వద్ద చిరుత ఎల్లారెడ్డి- కామారెడ్డి ప్రధాన రహదారిని దాటుతుండగా పోలీసులు మొబైల్ ఫోన్లో ఫోటోలు తీయగా ఆ ఫోటోలు సైతం వైరల్ గా మారాయి. ఇంతవరకు బాగానే ఉన్నా చిరుత పులి సంచారంతో మేంగారంతో పాటు లింగంపేట అటవీ ప్రాంతానికి దగ్గర గా ఉన్న శివారు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎల్లారెడ్డి- లింగంపేట మధ్య రాత్రి పూట ప్రయాణం చేయాలంటే వాహనదారులు భయాందోళనకు

