- ఓటుకు డబ్బు, మద్యం, కానుకలు ఇచ్చే పద్దతిని పాతరేయండి..
- మంచి విలువలు, జ్ఞానం కలిగిన నాయకత్వం గ్రామాల నుండే తయారవ్వాలి..
- పార్టీలను కాదు.. ప్రజలను గెలిపించుకుందాo..
- పెండ్యాల సుమన్, కోడెపాక భాస్కర్.
మన ప్రగతి న్యూస్/నడికూడ:
ఓటర్లు డబ్బు, మద్యానికి, కానుక లకు బానిసలు కాకుండా.. నైతిక విలువలతో కూడిన అభ్యర్థిని ఎన్నుకొని ప్రజాస్వా మ్యం గెలుపొందే విధంగా సమాయత్తం కావాలని సైంటిఫిక్ స్టడీ ఫోరం ఎస్ఎస్ ఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు టీఎంజేఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెండ్యాల సుమన్, టిఎంజేఎఫ్ హనుమ కొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్ లు అన్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేల గ్రామాల్లో పండగ వాతావరణం చూస్తున్నాం.. అయితే గ్రామాల్లోంచే గొప్ప నాయకత్వం పురుడు పోసుకుంటుందన్న విషయాన్ని మనం మరిచిపోకూడదు.. అభ్యర్థులు గొప్పలకు పోయి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి అప్పుల పాలై ప్రాణాలు వదిలిన వారిని కూడా చూసాం.. తీరా గెలిచాక కూడా గ్రామాభి వృద్ధికి ఎన్నో అప్పులు చేసి, తీరా బిల్లు లు రాక ప్రాణాలు కోల్పోయిన సర్పంచ్ లను కూడా చూస్తున్నాం. కావునా స్తోమ తకు మించి ఖర్చు చేయడం ముమ్మాటికీ మూర్కత్వమే. ఓటర్ల కి మద్యం,డబ్బులు కానుకలు ఇచ్చే పద్దతిని పాతరేయండి. ఎట్టి పరిస్థితిల్లో ప్రలోభాలు పెట్టే విధానం ను కొనసాగించకండి. మీరు రైతులకు, వృద్దులకు, మహిళలకు ఎటువంటి భరోసా ఇస్తారో చెప్పండి. పాఠశాల నిర్మాణంలో లైబ్రరీ నిర్మాణం, చిన్న పరిశ్రమల నిర్మాణం ఎలా చేస్తారో జ్ఞాన వంతమైన గ్రామాన్ని, నిరుద్యోగం నిర్మూలనకు ప్రణాళిక ఏంటో వివరిం చండి. ఆకస్మికంగా సంభవించు పరిణా మాలకు ఎలా అండగా ఉంటారో చెప్పం డి. పోలీస్ స్టేషన్ వరకు గొడవలు సమ స్యలు వెళ్లకుండా ఎలా న్యాయంగా ఉంటూ గ్రామాన్ని సమైక్యంగా ఒక కుటుంబంలా ఉండేలా.. ఎలా చొరవ చూపుతారో గొప్పగా ఆలోచన చేసి వివరించి ఓటర్ల మనసు మన్ననలు పొంది గెలవండి. అభ్యర్థులు ఎవరు డబ్బు, మద్యం కానుకలు ఇవ్వడం మానేస్తే తప్పనిసరి ఉన్న వారిలో మంచి వారు ఎవరు అనే ఆలోచన ఓటర్లలో కలిగి మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఏర్పడుతుందని, గమనించగ లరు. అన్ని పంచి గెలిస్తే నీ గెలుపు ఎట్లా అవుతుంది.. పంచిన వాటి ప్రభావం అవు తుందే తప్ప.. నైతికంగా నీ గెలుపు కాదు అని భావించి పంచుటకు ప్రలోభాలకు అందరు అభ్యర్థులు దూరంగా ఉండండి. ప్రలోభాలు పంచడాలు అభ్యర్థులు అందరూ ఆపేసి హక్కుగా బాధ్యతగా ఓటు వేసే పదిమంది ఓటర్ల మెజార్టీ తో నైనా గెలవండి కానీ.. ప్రలోభాలు పెట్టి,10 వేల మెజారిటీతో గెలిచినా గెలుపు కాదు.
*ప్రశ్నించడం కోల్పోయిన రోజే ప్రగతి ఆగిపోయిన్నట్లు*..
గ్రామ ఓటర్లు మీరే అత్యంత జ్ఞానులు అనేది మరువకండి. భవిష్యత్తు అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంది. నీ గ్రామం కోసం నీ నిజాయితీ చూపించే అవకాశం ఇదే. జర బుర్ర పెట్టి ఆలోచన చేసే సమయం ఇదే గ్రామంలో యువత ఎందుకు చెడిపోతుం ది, గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు నువ్వు చదువుకున్నప్పుడు ఎలా ఉండే నువ్వు ఓటరుగా మారే స్థాయి వచ్చినా ఇప్పుడు ఎలా ఉన్నాయ్, గ్రామాల్లో లైబ్రరీ లు ఎన్ని ఉన్నాయ్ ఎలా ఉన్నాయ్ గ్రామం నుండి క్రీడాకారులను తయారు చేస్తున్నారా, ఏమేమి సౌకర్యాలు ఉన్నా య్.. కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూసే యువత భవిష్యత్తు కోసం ప్రణా ళిక ఏది, అవన్నీ నీ చేతుల్లో ఉన్నాయ్, యువత మత్తుకు డ్రగ్స్ కి ఎవరి లోపం వల్ల ఆకర్షితులు అవుతున్నారు. మొత్తం గ్రామాన్నే పరిరక్షణ చేసే అవకాశం నీకు వచ్చినప్పుడు ఉన్నప్పుడు నువ్ ఎంత గొప్పగా ఆలోచన చేయాలి. పార్టీలను, ప్రలోభాలను పెట్టె నాయకుల కాదు. ప్రజల నుండే ఒక గొప్ప నాయకు న్ని ఎన్నుకోలేమా.. ప్రతిసారి పార్టీలను గెలిపిస్తున్నాం.. ఈసారైన ప్రజలను గెలిపించుకుందాం..ఆఫ్ట్రాల్ కోటర్ కి, వెయ్యికి, రెండు వేలకు జై కొట్టె స్థాయికి ఎందుకు దిగజారాలి. భవిష్యత్తును ఎందుకు తాకట్టు పెట్టాలి.. తాత్కాలిక చిన్న ఆనందాలకు లోనై గ్రామాన్ని అంధ కారంలో పడేస్తావా.. జరా బుర్ర పెట్టి ఆలోచన చేయి, ఇంకా బానిసత్వమా గ్రామాల్లో బీసీ, ఎస్సీ ఎస్టీ, మహిళా రిజర్వేషన్ లు ఉన్న చోట పరోక్షంగా అగ్ర కుల నాయకుల పెత్తనం స్పష్టంగా కనిపి స్తున్నది. వాస్తవం కదా..70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇంకా కింది కులాల వారు ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకునే జ్ఞానం లేదని అంగీకరిస్తున్నారా.. మహిళల సలహాలు స్వికరిస్తున్నారా.. వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారా.. గమనించాలి. ఇది పురుషాధిక్యం బానిసత్వ సంకేతాలు కావా.. ఆలోచన చేయండి, వాటికీ ప్రలో భాలు పెట్టాలనే ధోరణి ఒక కారణం కాదా గమనించగలరు. గ్రామాల్లో సమిష్టి నిర్ణయాలు తీసుకోని ముందుకు వెళ్ల లేరా.. ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణలోని గ్రామస్తులు చదువు కున్న జ్ఞానులకు అవకాశం కల్పించి, భారత దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అని నిరూపించి, ఓటర్లు ఈ ఎన్నికల్లో నైనా నూతన ఒరవడి సృష్టించాలి.

