-ఐటీడీఏ ఎడ్యుకేషనల్ ఏసి ఎం ఓ రమేష్
మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, చీపురుగూడెం ఏ హెచ్ ఎస్ బాలుర పాఠశాలను ఐ టి డి ఏ, ఎడ్యుకేషనల్ ఏ సి ఎం ఓ రమేష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలోని పదవ తరగతి విద్యార్థుల ప్రతిభా పాటవాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్దీపకం పుస్తకాన్ని విద్యార్థులచే కంఠస్థం చేయిస్తే విద్యార్థుల ప్రతిభా పాటవాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పెంటయ్య, హాస్టల్ వార్డెన్ వీరస్వామి, సీనియర్ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ప్రభాకర్, చీపురుగూడెం పాఠశాల పర్యవేక్షణ అధికారి ఎన్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

