- వెంకటేశ్వర్లపల్లి ప్రచారంలో ఎమ్మెల్యే రేవూరి..
మన ప్రగతి న్యూస్/నడికూడ:
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని పరకాల శాసన సభ్యులు ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నడికూడ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రచారం లో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో గ్రామాలు కుంటుపడ్డాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచులను గెలిపిస్తే..గ్రామాలన్ని అభివృద్ధి చెందుతాయని చెప్పారు. నిరు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు, తదితరు అంశాలపై ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్య కర్తలు, తదితరులు పాల్గొన్నారు.


