Breaking News

గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి

మన ప్రగతి న్యూస్ /
వేములవాడ అర్బన్

వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీ సర్పంచ్ అభ్యర్థి చర్ల మురళి (51) గుండెపోటుతో మృతి చెందారు. బీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఆయనకు గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో అతనిని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా, గుండెపోటు తీవ్రత ఎక్కువగా ఉన్నందున వైద్యుల సూచన మేరకు కరీంనగర్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు.ఇతనికి ఇద్దరు పిల్లలు ఒక కుమారుడు(26) ఒక కుమార్తే(20).

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు