Breaking News

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఏసీపీ వసుంధర యాదవ్ రేపల్లెవాడ కేంద్రం లో ఏర్పాట్లపై సంతృప్తి

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:

ఏన్కూర్ మండల కేంద్రంలోని రేపల్లెవాడ నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం కల్లూరు డివిజన్ ఏసీపీ వసుంధర యాదవ్ ఐపీఎస్ పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియను సమీక్షించిన ఆమె, కేంద్రంలో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన అభ్యర్థులు, ప్రజలను ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయని ప్రజలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, ఏదైనా ఇబ్బందులు ఉన్న వెంటనే ఏన్కూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శంకర్ పనితీరును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎన్.సంధ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పెండింగ్ బిల్లులు చెల్లించాలి..