_ ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి. బి.పుష్పలత
మన ప్రగతి న్యూస్ / రాజన్న సిరిసిల్ల జిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజలందరూ ఈ నెల 21న జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని, కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించు కోవాలని ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి. బి.పుష్పలత అన్నారు.
శనివారం జిల్లా కోర్టు సముదాయంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ జిల్లా జడ్జి గారు పోలీసు అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా ఎస్పీ శ్రీ.డి.చంద్రయ్య, సీనియర్ సివిల్ జడ్జి, సిరిసిల్ల/ఇన్చార్జి కార్యదర్శి శ్రీ. పి.లక్ష్మణాచారి, సీనియర్ సివిల్ జడ్జి, వేములవాడ శ్రీ.అజయ్ కుమార్ జాదవ్, డీఎస్పీ నాగేంద్రచారి, మేజిస్ట్రేట్లు శ్రీ.ప్రవీణ్, శ్రీమతి.సృజన, శ్రీమతి. జ్యోతిర్మయి మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

