బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

వైజాగ్ వన్డేలో టీమిండియా ఘనవిజయం .. సిరీస్ కైవసం..

  • మూడో వన్డేలో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్..
  • 2-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం,
    అజేయ సెంచరీతో చెలరేగిన
    యశస్వి జైస్వాల్..
  • చెరో నాలుగు వికెట్లతో సత్తా చాటిన కుల్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ.

మన ప్రగతి న్యూస్/ప్రత్యేక ప్రతినిధి:

దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా జయ భేరి మోగించింది. విశాఖపట్నం ఏసీఏ- వీడీ సీఏ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడా తో సఫారీ జట్టును చిత్తు చేసి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ లో తొలి వన్డేలో భారత్ నెగ్గ గా, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలి చింది. దీంతో ఇరు జట్లకు కీలకంగా మారిన ఆఖరి మ్యాచ్‌ లో భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.271 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ (75) దూకుడుగా ఆడగా, యశస్వి జైస్వాల్ (116 నాటౌట్) అజేయ సెంచరీతో కదం తొక్కాడు. జైస్వాల్ స్కోరులో 12 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. రోహిత్ ఔటయ్యాక క్రీజు లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (45 బంతుల్లో 65 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 39.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్, దక్షిణాఫ్రికాను 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ చేసింది. సఫారీ జట్టులో ఓపెనర్ క్వింటన్ డి కాక్ (106) సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ బవుమా (48) ఫర్వాలేదనిపిం చినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో నాలుగు వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించారు. అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం