Breaking News

మళ్లీ మోసపోవద్దు.. గోస పడొద్దు..

  • చల్లా ధర్మారెడ్డి..

మన ప్రగతి న్యూస్/ నడికూడ:

అమలుకు సాధ్యం హామీలిచ్చిన కాంగ్రెస్‌ మాయమాటలు నమ్మి మరోసారి మోస పోయి గోస పడవద్దని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపు నిచ్చా రు. మంగళవారం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. నడికూడ మండలం వెంకటేశ్వ ర్లపల్లి గ్రామంలో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పెండ్యాల మహేందర్ రెడ్డి తరపు న గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడు తూ.. పల్లెల ప్రగతి కోసం నిస్వార్థంగా పనిచేసేదెవరో ఆలోచించి గ్రామపంచా యతీ ఎన్నికల్లో ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలు లో విఫలమైందని విమర్శించారు. పంచా యతీ ఎన్నికలున్నాయని గ్రామాల్లో మహి ళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశా రని, కానీ, పట్టణాల్లో ఎన్నికలు లేవని మహిళలు ఇవ్వలేదన్నారు.ఓట్ల కోసమే చీరలను అందించిన విషయాన్ని మహిళ లు గ్రహించాలని కోరారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాలను ఆద ర్శంగా నిలిపారని గుర్తు చేశారు.కాంగ్రెస్‌ పార్టీ సాధారణ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీ ల పేరుతో 420 మోసపూరిత హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శిం చారు. రెండేళ్ల రేవంత్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని అన్నారు. కేసీఆర్‌ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి పదేళ్ల తన పాలనలో ముఖ్య మంత్రిగా రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని గుర్తుచేశారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, దళిత బంధు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్‌ కిట్‌ వంటి ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందారన్నారు. సబ్బం డ వర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడిని కాదనుకొని ఓ మాయలోడిని తీసుకొచ్చి సీటులో కూర్చో బెట్టారని అన్నారు. ప్రజా సంక్షేమం, అభి వృద్ధిపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సోయి లేద న్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్ప టి నుంచి ప్రజలకు, రైతులకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెండ్యాల మహేందర్ రెడ్డి మరియు వారి వార్డుల అభ్యర్థులను గెలిపించి గ్రామ అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను కోరారు. మాజీ ఎమ్మెల్యే చల్లా వెంట.. మండల పార్టీ అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి,ప్రధాన కార్యదర్శి గణపతి రెడ్డి, నాయకులు.. మేడిపెల్లి శోభన్ బాబు, భీముడి నాగి రెడ్డి, సుధాటి వెంకటేశ్వర రావు, బిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..