Breaking News

పంచాయతీ ఎన్నికల్లో..కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలి

ఎన్నికల హామీలు నెరవేర్చని కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు ఎందుకు ఓటెయ్యాలి?

అశ్వారావుపేట మాజీ ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి

మన ప్రగతి న్యూస్/అశ్వారావుపేట ప్రతినిధి

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి గ్రామ పంచాయతీలో మాజీ ఎంపీపీ మండల నాయకుల ప్రచారం.గ్రామంలో అభివృద్ధి కేసీఆర్ పాలనలోనే జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదు.ఉట్లపల్లి సర్పంచ్ అభ్యర్థి బి ఆర్ ఎస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న తెలగారెడ్డి గంగా భవాని గారిని గెలిపించాలని విజ్ఞప్తి.కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ఒక్క ఎన్నికల హామీ కూడా నెరవేర్చలేదని, ఆ పార్టీ మద్దతు దారులను గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓడించి గుణపాఠం చెప్పాలని, కర్రుకాల్చి వాత పెట్టాలని అశ్వరావుపేట మండల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి గ్రామపంచాయతీ బిఆర్ఎస్ పార్టీ తరపున నిల్చున్న గంగా భవాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రోడ్ వేసింది.. ప్రతి మోరి కట్టింది.. గ్రామపంచాతీ కార్యాలయం శ్మశాన వాటిక పల్లె ప్రకృతి వనాలు, ఆరోగ్య కేంద్రాలు కట్టించింది ఏర్పాటు చేసింది కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ నేతలు రెండేళ్లలో ఏం చేసారు? తట్టెడు మట్టి తీసారా? అని అయన ప్రశ్నించారు. నోటికివచ్చినట్లు మాట్లాడతామంటే కుదరదు.. బరాబర్ కేసీఆర్ చేసారు. గులాబీ జెండా గ్రామానికి అండగా ఉంది.ప్రజలు ఆలోచించాలని, పనులు చేసి ఓట్లు అడుగుతున్నామని, కాంగ్రెస్ బీజేపీలు ఏమి చేయలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతు బంధు, 24 కరెంట్ ఇచ్చామని, యూరియా బస్తాలకు పదేళ్లలో కొరత లేదని, రైతులు ఏనాడూ ఇబ్బంది పడలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక ఆడవాళ్లు కొట్టుకుంటున్నారని, రైతులు యూరియా బస్తాల కోసం నిలుచుంటున్నారని విమర్శించారు. రైతు చనిపోతే.. రైతు బీమా ఇచ్చి కేసీఆర్ ఆదుకున్నారని, రైతులు శ్రమించి పండించిన ప్రతి గింజ కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, కేసీఆర్ కల్యాణలక్ష్మి కింద లక్ష 116 ఇచ్చారని, న్యూట్రీషియన్ కిట్ ఇచ్చి, ఫ్రీగా డెలివరీ చేసి మగబిడ్డ అయితే రూ. 12 వేలు, ఆడబిడ్డ అయితే రూ.13 వేలు అంబులెన్స్లో ఇంటివద్ద దించారని అన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ కిట్ ఎందుకు ఇవ్వడం లేదని,తులం బంగారం ఏమైందని, ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారని,ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ రూ. 4 వేల పింఛన్ వికలాంగులకు ఇచ్చారని, వృద్దులకు రూ.500 పింఛన్ ఉంటె.. 4 వేలు చేసారని గుర్తు చేసారు.
గంగా భవాని గ్రామంలో ఎప్పుడు.. 24 గంటలు అందుబాటులో ఉంటారు.. మీ నోట్లో నాలుకలా ఉంటారు… కష్టం వస్తె అందరం అండగా నిలబడతాం…మోస పొతే గోస పడతాం అని కేసీఆర్ ఆనాడే చెప్పారని, కనుక ఆలోచించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగా భవాని నీ గెలిపిస్తే ప్రతి ఒక్క హామి ముక్కు పిండి అమలు చేసేలా పోరాడతామని తెలిపారు.ఈ కార్యక్రమం లో అశ్వారావుపేట మాజీ ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి,మండల నాయకులు కాసాని చంద్రమోహన్, అశ్వరావుపేట టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, యువజన విభాగం అధ్యక్షులు మోటూరి మోహన్ ,కాటుకూరు వెంకటేశ్వర రావు,కోడూరి నాగు,సర్పంచ్ అభ్యర్థి గంగా భవాని,ప్రభాకర్, నల్ల.సత్యనారాయణ,బ్రహ్మాజీ, ఎపుగంటి వీరబాబు, సింహాద్రి.వీర్రాజు,కొట్టే సోమరాజు,BRS నాయకులు కార్యకర్తలు,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.