ఇంటింటా ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పగడాల రమాదేవి
మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట గ్రామ పంచాయతీలో డిసెంబర్ 14వ తేదీన జరగబోవు ఎన్నికల సందర్భంగా సిపిఐ, సిపిఐ ఎంఎల్, జనసేన పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పగడాల రాంబాబు సతీమణి విద్యావేత్త, సౌమ్యురాలైన పగడాల రమాదేవి ఇంటింటా ప్రచారంలో భాగంగా అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తేనే గ్రామ అభివృద్ధి సాధ్యమని సర్పంచ్ అభ్యర్థి పగడాల రమాదేవి ఓటర్లను కోరుతున్నారు. అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయిన నన్ను తమ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుపై వేసి నన్ను గెలిపిస్తే గ్రామాభివృద్ధి, గ్రామ పంచాయతీలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సంక్షేమ ఫలాలను అందిస్తానని ఈ సందర్భంగా ఓటర్లకు హామీనిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే అవినీతిపరులను నమ్మవద్దని, నీతివంతమైన సుపరిపాలన ఇచ్చే నాయకులను ఎన్నుకోవాలని ఆమె తెలిపారు. దమ్మపేట గ్రామపంచాయతీ ఓటర్లు చాలా తెలివైన వారని ప్రస్తుతం ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఎలాంటి వారో ఓటర్ మహాశయులకు క్షుణంగా తెలుసునని అందుకే ఓటర్ మహాశయులందరూ ఆలోచించి నీతివంతమైన సమర్థవంతమైన పాలన కోసం ఆలోచించి ఓటు వేయాలని ఆమె పిలుపునిస్తూ విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు

