గ్రామ అధ్యక్షుడి కూతురుగా కాదు –ఊరు అభివృద్ధి కొరకై వస్తున్న: చూడ నవ్య
సీనియర్ నాయకుల ఆధిపత్యానికి యువ శక్తి సవాల్
మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి:
ఎల్లారెడ్డి మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి రాజకీయాల్లో యువత సీనియర్ నాయకులకు బదులుగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారు. ఆడ, మగ అని తేడా లేకుండా గ్రామస్థాయి రాజకీయాల్లో పోటీ పడుతున్న యువత, పాత తరపు నాయకులకు కొరకరాని కొయ్యగా మారుతున్నారు. అదే తరహాలో కళ్యాణి – రత్నాపూర్ ఉమ్మడి గ్రామపంచాయతీ సర్పంచ్ పోరులో 22 ఏళ్ల చూడ నవ్య ప్రవేశం స్థానిక రాజకీయాల్లో కొత్త ఊపును సృష్టించింది.ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతో ఉన్న చూడ నవ్య, విద్యతో పాటు విలువలు, సేవామార్గం, గ్రామాభివృద్ధిపై స్పష్టమైన దృష్టితో ముందుకు వస్తోంది. ఆమె తండ్రి చూడ సంజీవులు, కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడుగా స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ నాయకత్వంలో గ్రామానికి సేవలందిస్తున్నారు. పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతను ప్రధాన ద్యేయంగా తీసుకుని ముందుకు సాగుతున్న తరుణంలో, తన కూతురు కూడా అదే దిశగా అడుగులు వేయాలని ఆయన నిర్ణయించుకున్నారన్నారు. ఈ సందర్భంగా చూడ సంజీవులు మాట్లాడుతూ మహిళలే సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి. పార్టీ కూడా మహిళా నాయకత్వాన్నిపెంపొందించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. నా కూతురు చదువులో రాణించినట్టు ప్రజా సేవలో కూడా నిలదొక్కుకోవాలి అన్న కోరికతోనే బరిలోకి దింపాను. గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తారని, నవ్య ఖచ్చితంగా సర్పంచ్ పోరులో విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఆశాభావం వ్యక్తం చేశారు. కళ్యాణి–రత్నాపూర్ గ్రామ పంచాయతీలో సీనియర్ నాయకులు సంవత్సరాలుగా ఆధిపత్యం చాటుతున్న నేపథ్యంలో, ఒక యువతి ఈ స్థాయిలో సర్పంచ్ పోరుకు సిద్ధమవడం స్థానిక రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతమని గ్రామస్తులు భావిస్తున్నారు. మహిళలు, యువత, విద్యార్థులు ఆమె అభ్యర్థిత్వానికి విశేష స్పందన ఇస్తున్నారు. సర్పంచ్ పోరు ఈసారి కేవలం ఎన్నిక కాదు యువ ఆలోచనలు వి ఎస్ పాత రాజకీయాల మధ్య పోటిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మహిళా సాధికారత నిర్ణయాలకు అనుగుణంగా, చూడ నవ్య బరిలోకి రావడం గ్రామ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని పత్రికా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తంగా, కళ్యాణి–రత్నాపూర్ ఉమ్మడి గ్రామపంచాయతీ సర్పంచ్ పోరులో 22 ఏళ్ల చూడ నవ్య ప్రవేశం, యువత శక్తి, మహిళా సాధికారత, అభివృద్ధి లక్ష్యాల సమ్మేళనం గా నిలుస్తూ ప్రజల మనసులను ఆకర్షిస్తోంది.

