Breaking News

లక్ష్మీదేవి గూడెంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జోరుగా ప్రచారం

సర్పంచ్ అభ్యర్థిగా ఎలికట్టి భరత్

మన ప్రగతి న్యూస్/ నల్గొండ/వేములపల్లి

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఎలికట్టి భరత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ప్రచారంలో భాగంగా పేరపాక రాంబాబును కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ సీనియర్ నాయకులు ఆహ్వానించారు. ఎలుకట్టి భరత్ మాట్లాడుతూ రాంబాబు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాంబాబుని మర్యాదపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో గల్లి గల్లి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధి అధికార పార్టీ కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందని పార్టీ నాయకులు సర్పంచ్ అభ్యర్థి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నే అధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. భరత్ మాట్లాడుతూ నన్ను గెలిపించే ప్రజలకు వందనాలు అని తెలియజేశారు. నేను గెలిస్తే అది ప్రజల గెలుపు అవుతుందని భరత్ తెలియజేశారు.