ఉంగరం గుర్తుపై ఆశీర్వాదం కోరుతున్న అభ్యర్థి అజ్మీర సురేష్
మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:
ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అజ్మీర సురేష్ ప్రచార వేగాన్ని మరింత పెంచారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించిన ఆయన, తమ నాయకత్వంలో గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.గ్రామ ప్రజల ఆశీస్సులు నాకు శక్తి. ఉంగరం గుర్తుపై మీ ఓటు నాకు వేసి గెలిపించండి. మీ ప్రతి సమస్య పరిష్కారమే నా లక్ష్యం అని ఆయన అన్నారు. రేపల్లెవాడ గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా కేటాయించబడిన విషయాన్ని ప్రజలకు గుర్తుచేస్తూ, ఈ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే గ్రామ అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు ఆయన వివరించారు. గ్రామ ప్రజల సంక్షేమం కోసం తాను అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ నాయకులు, వార్డు నెంబర్ల అభ్యర్థులు, యువత, మహిళా శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

