Breaking News

ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా

ముత్యాలమ్మ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ సురేష్

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

గ్రామ సర్పంచ్ మేనిఫెస్టో

ముత్యాలమ్మ తండ
నేను అనగా బానోతు సురేష్ అనే నేను సర్పంచ్, అభ్యర్థిగా నన్ను భారీ మెజారిటీతో ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపించినట్లయితే ఈ క్రింది హామీలను నెరవేస్తానని మీ అందరి ముందు ప్రకటిస్తున్న:-

మాన గ్రామం – మాన బాధ్యత

గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, సమాన న్యాయం అనే లక్ష్యాలతో గ్రామ ప్రజల భాగస్వామ్యంతో, నిజాయితీతో, నిరంతర సేవతో మాన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను.

  1. మౌలిక వసతులు

ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు

సిమెంట్ రోడ్లు, కాలువల అభివృద్ధి

వీధి దీపాలు (LED) – 100% కవరేజ్

డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుదల

  1. పారిశుధ్యం & ఆరోగ్యం

స్వచ్ఛ గ్రామ కార్యక్రమం – చెత్త వేర్పాటు, డోర్ టు డోర్ సేకరణ

ప్రతి ఇంటికి మరుగుదొడ్లు – వాడకం నిర్ధారణ

గ్రామ ఆరోగ్య శిబిరాలు, ఉచిత వైద్య పరీక్షలు

మలేరియా, డెంగ్యూ నివారణ చర్యలు

  1. విద్య & యువత

ముత్యాలమ్మ తండ లో ఉన్న ప్రైమరీ స్కూల్ చుట్టూ ప్రహరి గోడ కట్టి గేటు ఏర్పాటు చేస్తాను

జంగాలపల్లి తండ లో ఉన్న ప్రైమరీ స్కూల్ చుట్టూ ప్రహరి గోడ కట్టి గేటు ఏర్పాటు చేస్తాను

MGNREGS నిధులతో కట్టిన స్మశాన వాటికకు సి‌సి రోడ్డు నిర్మాణం చేస్తాను, మరియు అక్కడ వాటర్ సౌకర్యం ఎర్పాటు చేస్తాను

ముత్యాలమ్మ తండాలో గ్రామపంచాయతీ పక్కన హెల్త్ సబ్ సెంటర్ బిల్డింగు నిర్మాణం చేపిస్తాను

ముత్యాలమ్మ తండలో గతంలో శాంక్షన్ అయినటువంటి అంగన్వాడి బిల్డింగును మళ్లీ ఐటిడిఏ నుండి ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి కట్టిస్తాను

పాఠశాల భవనాల మరమ్మతులు, మరుగుదొడ్లు ఎర్పాటు చేస్తాను

విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారాలు అందుబాటు

యువతకు క్రీడా మైదానం, గ్రంథాలయం నిర్మిస్తాను

మన ఊరిలో జరిగే దసరా ఉత్సవాల్లో భాగంగా బొడ్రాయి ప్రతి ఏటా ఖర్చులను ఊరి సర్పంచ్ గా భరిస్తాను

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

గ్రామంలో ప్రతి ఏటా క్రీడలు నిర్వహిస్తాను యువకులను క్రీడారంగంలో ఉన్న వాళ్లను పై స్థాయికి ఎదిగేటట్టు ప్రోత్సహిస్తాను

ముత్యాలమ్మ తండాలో మన మెయిన్ రోడ్డుకు ఇరువైపులామన డ్రైనేజీ నిర్మిస్తాను

ముత్యాలమ్మ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఎవరైనా పూర్తిగా నిరుపేద, భూమిలేని వారు అయి ఉంటే దురదృష్టం తో చనిపోతే దహన సంస్కారాల ఖర్చులు పూర్తిగా నేనే భరిస్తాను

మన గ్రామపంచాయతీలో మూడు తండాల పరిధిలో విద్య, వైద్యం కొరకు ప్రభుత్వం నుండి ఏం జరగాలో పూర్తిగా గ్రామస్తుల సమక్షంలోనే గ్రామసభ నిర్వహించి, నిర్ణయం తీసుకుంటాను

గ్రామంలో ఉన్నటువంటి మహిళా సంఘాలను కూడా గ్రామపంచాయతీ నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను

గార్లగడ్డ తండాలో తీసుకున్నటువంటి రేషన్ బియ్యం సెంటర్ ను సబ్ సెంటర్ గా మన గ్రామ పంచాయతీలోనే పెట్టిస్తాను

గ్రామంలో ఉన్న వారి అందరికీ సంక్షేమ పథకాలు విషయంలో అర్హులైన వారికే అందించేలా కృషి చేస్తాను

వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, మరియు వికలాంగుల పెన్షన్లు వచ్చేటట్టు చేస్తానని హామీ ఇస్తున్న.

బంగారు తల్లి పథకం కింద ఏ ఆడబిడ్డకైనా రెండవ కాన్పు కూతురు జన్మించినట్లయితే సర్పంచ్ జితా బత్యం నుండి 10116 ఆర్థిక సహాయాన్ని అందిస్తాను..

రైతులకు ఎంతో ఇబ్బందికరంగా మారిన కోతుల బెడద నుండి ఉపశమానం కలిగించే విధంగా కోతులు లేని గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం.

గ్రామ భద్రత కొరకై గ్రామంలో సీసీ కెమెరాలు CCTV అమర్చుట.

ముత్యాలమ్మ తండాలో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మిస్తాను

గ్రామపంచాయతి పరదిలో ఉన్నటువంటి ముత్యలమ్మ తండ ,జంగలపల్లి తండ,మంజ్య నాయక్ తాండలలో మిగిలిపోయిన రోడ్లకు ఐదు సంవత్సరం లోపల సిసి రోడ్లు నిర్మాణం పూర్తి చేస్తాను.

వాటర్ ప్లాంటు ఎర్పాటు చేస్తాను

గ్రామములొ మరగు దొడ్లు, ఇంకుడు గుంతలు లేని వారికి కొత్త శాంక్షన్ లు ఇప్పిస్తాను

పారిశుధ్యం దోమల నివారణ కోసం గ్రామపంచాయతీ పరిధి లో ఉన్న మూడు తండాలలొ పాగింగ్ మిషన్ ప్రతి వారము చేపిస్తాను…

గ్రామములొ ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర జరిగే ప్రతి ఏటా శ్రీరామ నవమి ఉత్సవాలకు పూర్తి ఖర్చు నేనే భరిస్తాను….

మహిళా కమ్యూనిటీ హాల్ ను నిర్మిస్తాను..

ప్రతి ఏటా జరిగే వినాయక చవితి ఉత్సవాలకు మన గ్రామంలో షెడ్డు నిర్మాణం చేసి స్టేజ్ నిర్మిస్తాను…..

అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాను……

వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, మరియు వికలాంగుల పెన్షన్లు వచ్చేటట్టు చేస్తానని హామీ ఇస్తున్న.

ఒక విద్యావంతుని ఆదరించండి

oplus_2