Breaking News

పేద విద్యార్థుల చదువులకు మాట చేయూత

హరీశ్వర్ ఉన్నత చదువుల కోసం 1లక్ష రూపాయల అందజేత

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్

పేద అనాధ విద్యార్థిని, విద్యార్థుల ఉన్నత చదువులకు యు ఎస్ ఏ లో గల మాట (మిన్నె సోటా ప్రాంత తెలంగాణ అసోసియేషన్) చేయూతను అందిస్తూ ప్రోత్సహిస్తుందని అసోసియేషన్ ప్రతినిధి వంగాల రాజా మల్లారెడ్డి అన్నారు. మండలంలోని తొర్రూరు( జే) ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మిట్టపల్లి మార్టిన్ ఇంటర్ చదువులకు, పాలకుర్తి గ్రామానికి చెందిన పెనుగొండ హరీశ్వర్ బీకాం మొదటి సంవత్సరం తో పాటు ఉన్నత విద్య కోసం మాట అందించిన నగదును ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా రాజమల్లారెడ్డి మాట్లాడుతూ యూఎస్ఏ లో స్థిరపడిన చాడ వినయ్ కుమార్ రెడ్డి, పాతూరి సందీప్ లు తెలంగాణలోని తల్లిదండ్రులు లేని అనాధ విద్యార్థిని, విద్యార్థులను ఆర్థికంగా ఆదుకొని ఉన్న చదువులు చదివేందుకు మిన్నె సోట ప్రాంత తెలంగాణ అసోసియేషన్ను ఏర్పాటు చేసి పేద అనాధ విద్యార్థిని, విద్యార్థులకు అండగా నిలిచారని తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఒక్కో అనాధ విద్యార్థికి ఉన్నత చదువుల కోసం లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖర్చుపట్టే విద్యార్థి చదువులకు ఉపయోగపడాలని చాడ వినయ్ కుమార్ రెడ్డి, పాతూరి సందీప్ లు ఆకాంక్షించారని అన్నారు. జనగామ జిల్లాలో అనేకమంది పేద విద్యార్థిని, విద్యార్థుల ఉన్నత చదువులకు చేయూతను అందించారని తెలిపారు. ఈ అవకాశాన్ని అనాధ విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అసోసియేషన్ కు ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు బొబ్బాల సూర్య ప్రకాష్ రెడ్డి, బొబ్బాల రజిత రెడ్డి, బొబ్బాల అనీష్ రెడ్డి, కొత్త ఇంద్రారెడ్డి, స్థానికులు కమ్మగాని సతీష్ తదితరులు పాల్గొన్నారు.