మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
తొర్రురు మండలం బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్, కంటాయపాలెం గ్రామ వార్డు సభ్యులు ఎర్రం రాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన పనిచేస్తుందని అందుకే ఇతర పార్టీల చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికీ గుర్తింపు ఉంటుందని వారిని పార్టీ కాపాడుకుంటుందని తెలిపారు. వాటి నాయకులకు కార్యకర్తలకు ఎలాంటి కష్టాలు వచ్చినా ముందుండి కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెఅన్నారు.ఈ సందర్భంగా ఎర్రం రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై,కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించిందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ నాయకత్వంలో ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో, ప్రజల తరఫున నిజంగా పోరాడే కాంగ్రెస్ పార్టీలో చేరడం బాధ్యతగా భావించానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

