మండల కేంద్రంలో ఓ క్లినిక్ తనిఖీ
మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా. నరేష్ కుమార్
మన ప్రగతి న్యూస్ /వీణవంక:
వీణవంక మండల కేంద్రంలో కేబీ క్లినిక్ పేరుతో అర్హతలు లేకున్నా అన్వర్ పాషా అనే వ్యక్తి డాక్టర్ గా చలామణి అవుతున్నాడని తెలంగాణ మెడికల్ కౌన్సిల్, పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా. నరేష్ కుమార్ అన్నారు. వైద్యుడిగా అర్హతలు లేకున్నా అన్వర్ పాషా అనే నర్సింగ్ చేసిన వ్యక్తి సర్జరీలు, అబార్షన్లు చేస్తున్నాడనే సమాచారం మేరకు మండల కేంద్రంలోని కేబీ క్లినిక్ లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా. నరేష్ కుమార్ తో పాటు పలువురు అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ లేకుండా ఆసుపత్రి నడుపుతున్న అన్వర్ పాషా అనే వ్యక్తి ఎంపీహెచ్ఐడబ్ల్యూ (ఏఎన్ఎమ్) కోర్సు చేసి డాక్టర్ అనే ముసుగులో ప్రజలను మోసం చేస్తూ, ఎటువంటి అనుమతి లేకుండా బెడ్స్ ఏర్పాటు చేసి, ఐసీయు సెటప్ లాగా, మానిటర్లు, ల్యాబ్ నిర్వహణ, ఆపరేషన్ పరికరాలు ఏర్పాటు చేయడం , డయాగ్నస్టిక్స్ సెంటర్ నడుపుతున్నాడు. దీనికి లో ఉన్న పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు, ఇది ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగా నిర్వహిస్తూ ప్రిస్క్రిప్షన్ (మందుల చిట్టి) ప్యాడ్, కెబీ డయాగ్నొస్టిక్ సెంటర్ పేరుతో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. మెడికల్ కౌన్సిల్ ప్రకారం చట్టరీత్యా నేరం కాబట్టి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. చిన్నపాటి జబ్బులకు కూడా స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇవ్వడం వలన భవిష్యత్లో షుగర్, ఎముకలలో కాల్షియం తగ్గి మోకాళ్ళ, కిడ్నీ నొప్పులు రావడం జరుగుతుందని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా తనిఖీ చేయడం జరిగిందని, ఇలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇక్కడ మెడికల్ కౌన్సిల్ కమిటీ సభ్యులు డా. సుధీర్, డా. వెంకటస్వామి ఉన్నారు.

