Breaking News

ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడిగా దండు లక్ష్మయ్య..

మన ప్రగతి న్యూస్/ నడికూడ:

నడికూడ మండలం ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా మండలంలోని సర్వాపూర్ గ్రామ ఉపసర్పంచ్ దండు లక్ష్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మండలంలోని తొమ్మిది గ్రామాల ఉప సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి, మండల ఉప సర్పంచ్ ల ఫోరం ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా దండు లక్ష్మయ్య మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి, ఉప సర్పంచ్ ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ఫోరం పని చేస్తుందన్నారు.చిన్న గ్రామం ఉప సర్పంచ్ గా ఉన్న తనకు మండలం లో కీలక పదవికి సహకరించిన పర కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డికి, మండలంలోని అన్ని గ్రామాల ఉప సర్పంచ్ లకి కృతజ్ఞతలు తెలిపారు.

ఫోరం కమిటీలో పలు కీలక పదవులు..

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్

మండల ఫోరం ప్రధాన కార్యదర్శిగా పల్లె వెంకన్న( ధర్మారం),ఉపాధ్యక్షుడిగా యార ప్రవీణ్ (రామకృష్ణాపూర్), కోశాధికారిగా ఈర్ల లక్ష్మి (నార్లాపూర్), కార్యదర్శిగా కంకనాల వినయ్ (చౌటుపర్తి), కమిటీ సభ్యులుగా సిహెచ్. సురేందర్ రెడ్డి (రాయపర్తి), ముక్కెర రాజు (కౌకొండ), బొట్ల శ్యామల (ముస్త్యాలపల్లి) లు ఎన్నికయ్యారు.