మన ప్రగతి న్యూస్/నడికూడ:
పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు.. నడికూడ మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో.. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచుల ఫోరం నడికూడ మండల అధ్యక్షుడిగా నార్లాపూర్ గ్రామ సర్పంచ్ పెద్దబోయిన రవీందర్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఫోరం కమిటీ సభ్యులుగా..ప్రధాన కార్యదర్శిగా పెండ్లి లక్ష్మి (రామ కృష్ణాపురం సర్పంచ్), కార్య దర్శిగా కొంగంటి తిరుపతి (కంఠాత్మకూర్ సర్పంచ్), ఉపాధ్యక్షుడిగా రాజా జగత్ ప్రకాష్ (రాయపర్తి సర్పంచ్), కోశాధికారిగా భాషిక ఎల్లస్వామి (ధర్మారం సర్పంచ్) లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో నడికూడ గ్రామ సర్పంచ్ కుడ్ల మల హాల్ రావు, చర్లపల్లి సర్పంచ్ బండి రేణు క, చౌటుపర్తి సర్పంచ్ ఓదెల రూప, కౌకొండ సర్పంచ్ ఓదెల శ్రీలత, ముస్త్యాలపల్లి సర్పంచ్ మేకమల్ల వెంకటేష్, నర్సక్కపల్లి సర్పంచ్ కోడెపాక ముత్యాలు, పులిగిల్ల సర్పంచ్ ఇనుగాల పద్మ, సర్వాపూర్ సర్పంచ్ భోగి శ్రీలత, వరికోల్ సర్పంచ్ దుగ్గెల కుమారస్వామి, నడికూడ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అప్పం కుమారస్వామి తో పాటు మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన ఫోరం కమిటీ సభ్యులను అభినందిస్తూ, మండ ల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం ఫోరం అధ్యక్షుడు పెద్దబోయిన రవీందర్ యాదవ్ మాట్లాడుతూ..తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కి, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. మండల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తానని అన్నారు.

