Breaking News

మన ప్రగతి కథనానికి స్పందన..

మన ప్రగతి న్యూస్/నడికూడ:

” అమ్మవారికి తప్పని తిప్పలు “.. అనే శీర్షిక మన ప్రగతి దినపత్రిక లో శుక్రవారం ప్రచురితం కావడంతో.. స్పందించిన నడి కూడ సర్పంచ్ కుడ్ల మలహాల్ రావు మండల కేంద్రంలోని శ్రీ మారమ్మ తల్లి ఆలయం మరియు ప్రాంగణాన్ని స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. శ్రీ మార మ్మ తల్లి వద్ద నున్న పెద్ద వృక్షము, అలాగే గుడి ప్రాంగణం దెబ్బతినడం జరిగిందని తెలిపారు. త్వరలోనే ఆలయ పునర్నిర్మా ణం కోసం గ్రామస్తులతో సమీక్ష సమావే శం నిర్వహించి, సమస్యను పరిష్కరిస్తా నని హామీ ఇచ్చారు. సర్పంచ్ వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులున్నారు.

ముద్రగడ పద్మనాభం మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ సంతాపం