Breaking News

కమలాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

  • లారీ ఢీకొని.. ద్విచక్ర వాహనదారుడు మృతి..

మన ప్రగతి న్యూస్/కమలాపూర్:

లారీ కిందపడి ద్విచక్ర వాహనాదారుడు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కమలాపూర్ బస్టాండ్ వద్ద శాయం పేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన, కునారు శంకరయ్య కుమారుడు రాజు (30 ) లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాజు హుజు రాబాద్ నుండి పరకాలకు బైక్ పై వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థాని కులు వెంటనే కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని కమలాపూర్ సిఐ. హరికృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో వచ్చే వారికి ప్రాథమిక చి కిత్స అందించాలి