Breaking News

కమలాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

  • లారా కింద పడి ద్విచక్ర వాహనదారుడు మృతి..

మన ప్రగతి న్యూస్/కమలాపూర్:

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన, కునారు శంకరయ్య కుమారుడు రాజు (30 ) వృత్తి (తాపిమేస్త్రి) గా జీవనం సాగి స్తున్నారు. మృతుడు రాజు హుజురాబాద్ నుండి పరకాలకు బైక్ పై వెళ్లే క్రమంలో కమలాపూర్ బస్టాండ్ వద్ద గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలు కాగా.. స్థానికు లు వెంటనే కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని కమలాపూర్ సిఐ. హరికృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో వచ్చే వారికి ప్రాథమిక చి కిత్స అందించాలి