Breaking News

కలెక్టర్ సేవలకు అక్షరాభిషేకం జ్ఞాపిక అందజేత..

మన ప్రగతి న్యూస్/నడికూడ:

నూతన సంవత్సరం సందర్భంగా.. హను మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం సూప రింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న గుండాల నాగరాజు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలు తెలిపి,తను స్వయంగా కలెక్టర్ పై రాసిన అక్షరాభిషేకం జ్ఞాపిక ను అందజేశారు. కలెక్టర్ చేసిన సేవలను కవిత రూపంలో పొందుపరిచి మెమొంటో గా రూపొందిం చి, కలెక్టర్ కు అందజేశారు. గతంలో నడి కూడ తహసీల్దారుగా సేవలందించిన నాగరాజు అక్కడ పేద విద్యార్థుల చదు వుకు సహాయసహకారాలు అందించి, ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. సేవ భావంతో పాటు కవిత్వంపై ఉన్న అభిరు చిని కలెక్టర్ సేవల సత్కారానికి వినియో గించడంతో ఆయన ప్రతిభను పలువురు అభినందనలు తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో వచ్చే వారికి ప్రాథమిక చి కిత్స అందించాలి