Breaking News

పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి

గ్రామ సర్పంచ్ నారబోయిన సతీష్

వేములపల్లి మండలం సల్కునూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని గ్రామపంచాయతీ సర్పంచ్ సతీష్ అన్నారు. గ్రామంలో మురుగునీరు ప్రవహించడానికి సరైన డ్రైనేజీ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం డ్రైనేజీ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తానని, ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. గతంలో పనిచేసిన వారికి భిన్నంగా సేవలందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాచమల్ల సైదులు, పాలకవర్గం ,గ్రామపంచాయతీ కార్యదర్శి దివ్య ,కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో వచ్చే వారికి ప్రాథమిక చి కిత్స అందించాలి