యూరియా గోదాంలను పరిశీలించిన డి ఏ ఓ దామోదర్
మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి :
ఈ సీజన్లో వరి ధాన్యం సాగుచేసే రైతులకు యూరియా అందుబాటులో ఉందని డి ఏ ఓ దామోదర్ అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిల్వ ఉన్న యూరియా గోదాంలను వ్యవసాయధికారి జాస్మిన్ తో కలిసి పరిశీలించారు. కొత్తకోటలోని సింగిల్ విండో , హెచ్ ఏ సి ఏ, ఏ ఆర్ ఎస్ కే లను యూరియా అమ్మకాలు, అమ్మకాల రిజిస్టర్ నిర్వహణ, షామియానాల ఏర్పాటుకు సంబంధించి తనిఖీ చేసి, ఎకరానికి 1 బ్యాగ్ యూరియాను మాత్రమే అమ్మాలని ఆదేశించారు. రైతులతో మాట్లాడి, సీజన్‌కు తగినంత యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. యూరియా కొరత అనే అపోహ ఉందని గోదాంలో యూరియా సమృద్ధిగా ఉందని తెలిపారు. రైతులు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

