ఘనంగా నిర్వహించిన జై భీమ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, విష్డం స్టడీ సెంటర్.
ముఖ్య అతిధిగా హాజరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.దొడ్డి భద్రయ్య.
మన ప్రగతి న్యూస్/ పినపాక నియోజక వర్గ ప్రతినిది:
భారత దేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సమాజంలో అసమానతలపై అలుపెరుగనిపోరాటం చేసి మహిళా హక్కుల కోసం విశేష కృషి చేసింది మహాత్మా జ్యోతిరావు పూలే నని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ దొడ్డి భద్రయ్య శనివారం ఒక ప్రకటనలో అన్నారు. మహాత్మా సావిత్రి భాయి పూలే అతి పిన్న వయసులో మహాత్మ జోతి రావ్ పూలే తో వివాహం జరిగిందని మహిళలపై ఆనాటి సమాజం చూపే వివక్షను చూసి తట్టుకోలేక తన భర్త మహాత్మ పూలే వద్ద చదువు నేర్చుకొని తన ఇంటినే భారతదేశం లోనే మొట్టమొదటి పాఠశాలగా మార్చి మహిళల విధ్య అభ్యుదయానికి నాంది పలికినరాని తెలిపారు. ఇది చూసి ఓర్వలేక సంపన్న వర్గం అమ్మ సావిత్రి భాయి పై బురద నీళ్లు, పేడ నీళ్లు పోసి అవహేళన చేసిన పట్టువిడవక మహిళలందరికి చదువును చేరావేసిన క్రాంతి కారి సావిత్రిభాయి పూలే అని కొనియాడారు.జై భీమ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ విష్డం స్టడీ సెంటర్ నిర్వాహకులు బూర్గుల కరుణాకర్ భీమ్ మాట్లాడుతూ మహా త్యాగశీలి మహిళా అభ్యుదయ వాది మాత సావిత్రి భాయి పూలే జయంతి సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు . భద్రాద్రి జిల్లా అన్నీ పల్లెల్లో ఉచిత విద్యను అందించుటకు విష్డం స్టడీ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు, ఉత్సాహమైన విద్యావంతులు గ్రామాల్లో ఉచిత ట్యూషన్స్ కోసం హెల్ప్ లైన్ నెంబర్ 9603176031 కి కాల్, వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని కోరారు.ఈ కార్యక్రమం లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆంగ్ల ప్రోఫెసర్ బూర్గుల సతీష్ కుమార్, జూనియర్ కాలేజీ ప్రొఫసర్స్ పెరుమాళ్ళ కృష్ణ, బూర్గుల సురేష్, విష్డం స్టడీ సెంటర్ గైడ్ టీచర్స్ బూర్గుల సునీత పావని కుమారి, మేఘన మెర్సీ,మాలమహానాడు మణుగూరు మండల అధ్యక్షులు వేర్పుల నరేష్, గౌరవ అధ్యక్షులు మద్దెల భద్రయ్య, మణుగూరు ప్రెస్ క్లబ్ గౌరవఅధ్యక్షులు దామల్ల వెంకన్న,బిసి సంగంనాయకులు రామారావు,సంజీవరావు,ఎం ఆర్ పి యస్ నాయకులు హుస్సేన్,నాగేశ్వరావు, ప్రముఖ న్యాయవాది గోడిశాల వెంకట రత్నం, ప్రొఫెసర్ డా,,గోడిశాల ప్రసాద్,ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


