Breaking News

శ్రీమతి సావిత్రి భాయి ఫూలే జయంతి కార్యక్రమంలో బిజెపి నాయకులు

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ :

తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా హక్కుల కోసం, సాధికారత కోసం పోరాడి విజయం సాధించిన శ్రీమతి సావిత్రి భాయి ఫూలే 195వ జయంతి నివాళులు అర్పించిన బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు యం.ఎస్.వాసు, సుభాష్ నగర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు శాంపూర్ విజయేందర్ రెడ్డి.జీడిమెట్ల బస్ డిపో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోలా రాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొని, డీపో ఎదుట ఉన్న జ్యోతీరావు ఫూలే, సావిత్రి భాయి ఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ ఆ రోజుల్లోనే స్త్రీ ల విద్య కోసం పోరాడిన, కులవివక్ష కోసం పోరాడిన దీరవనిత, సమాజంలో చైతన్యం, అవగాహన తీసుకొచ్చిన ఆదర్శ మహిళ అని కొనియాడారు.నేడు అనేక రంగాల్లో దూసుకుపోతున్న మహిళలకు సావిత్రి భాయి ఫూలే ఆరోజుల్లోనే బాట వేశారని, సమాజాన్ని జాగృతం చేశారని గుర్తు చేస్తూ.ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జీడిమెట్ల ఆర్టీసీ డిపో బీసీ సంఘాల నాయకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో జీడిమెట్ల డిపో ఆర్టీసీ ఎంప్లాయిస్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కోలా రాజు గౌడ్, సెక్రటరీ ముద్దం మహేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ ముదిరాజ్, మహిళా నాయకులు గీతా,కవిత, ఉమాదేవి, రాజేశ్వరి.బిజెపి యువ నాయకులు బబ్లూ, మారుతి నాయుడు, కిరణ్ పాల్, నాగ శ్రీనివాస్, వినయ్ పాల్గొన్నారు…

జన్నారం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు