మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్:
ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో రైతుబందు మాజీ అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో మరోసారి విఫలమైందని. యూరియా ఆప్ పేరుతో మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని, ప్రభుత్వం పోయిన వర్షాకాలం పంటకు రైతులకు సరైన సమయంలో యూరియా అందించపోవడంతో పంట దిగుబడి రాక నష్టపోవడం జరిగింది. ఈసారి కూడా మళ్లీ రైతులు యూరియా కొరకు పిఎసిఎస్ సెంటర్ ల దగ్గర, షాపుల దగ్గర లైన్లు కట్టడం వల్ల మరోసారి ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందని, భయపడి యూరియా యాప్ పేరుతో కాంగ్రెస్ రైతుల్ని వంచించే ప్రయత్నం చేస్తున్నది. పేద, మధ్యతరగతి, చిన్న సన్నకారు రైతులకు స్మార్ట్ ఫోన్ లు లేక, అవి ఉన్నా కొంతమందికి వాడరాక నేడు ఈ యాప్ లో యూరియా బుక్ చేసుకోవడం రాక తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వము వెంటనే అప్ ఆలోచనను విరమించుకొని, రైతులందరికీ యూరియా సక్రమంగా అందుబాటులోకి తీసుకువచ్చి, యూరియా అందించాలి.లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ప్రభుత్వంపై మరోసారి యూరియా పోరాటం చేయడానికి సిద్ధమౌతామన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, నూతన సర్పంచులు మాచెట్టి లచయ్య, చిగురు నరేష్, బొమ్మెన ఆంజనేయులు, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్, యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి, విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు యండి. నవాజ్, గూడూరి భరత్, కొప్పు లక్ష్మణ్, ఎనగందుల నర్సింలు, ఎండి జహంగీర్, చిలువేరి ప్రశాంత్, దినేష్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

