Breaking News

జనసేన తరఫున నాలుగో వార్డు విజయం

కొవ్వూరి భార్గవికి పవన్ కళ్యాణ్ అభినందనలు

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

ముద్రగడ పద్మనాభం మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ సంతాపం

ఏన్కూర్ మండలం తూతక్కలింగన్నపేట గ్రామపంచాయతీలో జనసేన పార్టీ తరఫున నాలుగో వార్డులో పోటీ చేసిన కొవ్వూరి భార్గవి విజయం సాధించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమెను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి ఈ విజయం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవాభావంతో పనిచేయాలని కొవ్వూరి భార్గవికి సూచించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కొవ్వూరి భార్గవికి అభినందనలు తెలిపారు.