మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహం లో ఘన నివాళులు అర్పించడం జరిగింది,ఈ సందర్భంగా. జేఏసీ నాయకులు అడ్వకేట్ మధుసూదన్ బాబు, బీరెల్లి దానయ్య, నాగన్న, మాట్లాడుతూ
భారతావని బ్రిటిష్ గుప్పెట్లో ముక్కిములుగుతు నలుగుతూ నరకయాతన ఓక పక్క అనుభవిస్తుంటే.,మరో పక్క మహిళా జాతి కోసం ఓక దేవతామూర్తి ఉద్భవించిన సమయం రానే వచ్చింది ఆ సమయం 1831 జనవరి 03 నా మహారాష్ట్ర లో నైగన్ ( సతార) ప్రాంతం లో పురుడుపోసుకుంది ఆ మహావునుభావురాలు ఎవరో కాదు. మహిళా జాతి కి వన్నె తెచ్చిన స్ర్తీ అస్తిత్వం కోల్పోకుండా గొప్పది అని చాటి చెప్పిన మహోన్నత స్ర్తీమూర్తిరాలు సావిత్రిబాయి ఫూలే గారు జన్మించిన దినం ఈరోజు.భారత దేశంలో మొదటి మహిళ ఉపాధ్యాయురాలు. మహిళలలా తలరాత మార్చిన గొప్ప మాతృమూర్తి మహిళలు దేనికి తక్కువ కాదని నిరూపించిన మహానుభావురాలు భర్త అడుగు జాడ లో ఉంటూ తన జ్యోతి రావు పూలే గారి గౌరవం ఎక్కడ దెబ్బ తినకుండా తన అడుగూ జాడలో నడుస్తూ స్ర్తీ జాతి కి తన జీవితాన్నీ అకింతం చేసిన బడుగు బలహీనవర్గాలకు అండ గా నిలిచిన మహానుభావురాలు ఆ మాతృ మూర్తినీ స్మరించుకుంటూ భారత గడ్డమీద ఉన్న ప్రతి ఒక్కరు రుణపడి ఉన్నామని అన్నారు.ఆమె చేసిన సమాజ సేవ ఎన్నో బాలికలకు పాఠశాలలు స్థాపించి కీర్తినీ దేశ దేశాలు దాటి ఖండాలంతా విస్తరించి స్త్రీ జాతిని గొప్పగా చూపించినటువంటి మహానుభావురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు.ఈ కార్యక్రమంలో.వార్డెన్ సుజాత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


