మన ప్రగతి న్యూస్/ఎల్కతుర్తి:
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామానికి చెందిన మడ్డి కొము రయ్య భార్య విజయ (70) శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయం లో హాస్పిటల్ కి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుండి బయలుదేరి వెళ్లి తిరిగి రాలేదు. ఆమెకు కొంత మతి మరుపు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరికైనా ఈమె ఆచూకీ తెలిస్తే ..733793603, 8801318535, 96524 04909 ఈ నంబర్లకు ఫోన్ చేసి తెలపాలని కోరారు. ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి అందజేస్తామన్నారు.

