మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలో ప్రతి సంవత్సరం మాగశుద్ధ పౌర్ణమి రోజున ఋష్య ముఖ పర్వతం పై కొలువై ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం భక్తి శ్రద్దలతో కనులపండుగ లాగా నిర్వహించా రు. అలాగే ప్రతినెల పౌర్ణమి రోజు ఋష్యముఖ పర్వతం చుట్టు గిరి ప్రదక్షిణ చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆలయ అభి వృద్ధి కోసం, వెంకటేశ్వరయ స్వామి కళ్యాణం కోసం అన్ని ఏర్పాట్లు చేసే విధంగా నూతన ఆలయ కమిటీని ఏర్పాటు చేశారు. ఆలయ కమిటి చైర్మన్ గా కల్వకుంట్ల రాధ కిషన్ రావు మాజీ (సర్పంచ్) గౌరవ అధ్య క్షులుగా మాస శ్రీనివాస్ గ్రామ (సర్పంచ్) అధ్యక్షులుగా.. బలి కొండ కిషన్, ఉపాధ్యక్షులుగా యు పోరెడ్డి అంజన్న, అక్కల రమేష్, ప్రధాన కార్యదర్శి కర్ణకంటి రవీందర్ చారి, కోశాధికారి అలుగుల సత్త య్య,గౌరవ సలహాదారులుగా కండె బద్రి నారాయణ, వేముల హరి ప్రసాద్, ఆకనపెల్లి రవీందర్ మరియు15 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

