మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
మండలంలోని ఎస్సారెస్పీ కెనాల్కు అనుకొని ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా కడుతున్న నిర్మాణాలపై ఎస్సారెస్పీ ఏఈ పవిత్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనాల్ భద్రతకు నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం కలిగించేలా నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమని ఆమె తెలిపారు. పర్మిషన్ లేకుండా ఇలాంటి నిర్మాణాలు ఎలా చేస్తారని ఈ పవిత్ర ప్రశ్నించారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా కట్టడాలను నిర్మిస్తే నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

