మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రెడీమిక్స్ క్రషర్ కు ఎస్సారెస్పీ ఏఈ పవిత్ర సోమవారం నోటీసులు జారీ చేశారు. రెడ్డి మిక్స్ క్రషర్ వల్ల ప్రక్కనే ఉన్న కస్తూరిబా బాలికల విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని కంకర తరలించే భారీ లారీల రాకపోకలతో ఎస్సారెస్పీ కెనాల్ , సిసి రోడ్డు దెబ్బతింటుందని నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ సంబంధిత అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న ఎస్సారెస్పీ పవిత్ర క్రషర్ నిర్వాహకులకు తక్షణమే నోటీసులు జారీ చేశారు.


