Breaking News

హెల్మెట్ ధరించండి సురక్షితంగా ప్రయాణించండి

ఎస్సై దూలం పవన్ కుమార్

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

ముద్రగడ పద్మనాభం మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ సంతాపం

ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఎస్సై దూలం పవన్ కుమార్ అన్నారు.రోడ్డు భద్రత వారోత్సవలలో భాగంగా, వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో, ఎస్సై దూలం పవన్ కుమార్ వాహనదారులకు, రోడ్డు భద్రత ప్రమాణాల గురించి, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలన్నారు, ప్రతి వాహనదారుడు, లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో, పోలీస్ కానిస్టేబుల్ వల్లల రాజ్ కుమార్, పోలీస్ సిబ్బంది, వాహనదారులు, తదితరులు, పాల్గొన్నారు