పోతన సాహిత్య కళావేదిక అధ్యక్షులు మాన్యపు భుజేందర్
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :
ఆంధ్ర సారస్వతా పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరు అమరావతి నగరంలో జనవరి 3,4,5 తేదీలలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు రావాల్సిందిగా నిర్వాహకులు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామానికి చెందిన కవి,కళాకారుడు పోతన సాహిత్య కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యపు భుజేందర్ ఆహ్వానించగా, ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొని తెలుగు భాషను బ్రతికించుకుందాం అనే శీర్షికతో అద్భుతమైన కవితా గానం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర సరస్వతా పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కవి సమ్మేళన నిర్వాహకులు కొల్లూరి, రమావతి, కలిమి, ఉమామహేశ్వరరావు,ఈ వేమన, శ్రీమన్నారాయణ,
వీరాస్వామి చేతుల మీదుగా భుజేందర్ సన్మానం, సత్కారం,పత్రం, మెడల్ ప్రశంశాలను అందుకున్నారు. అవార్డు గ్రహీత భుజేందర్ ఈ సందర్భంగా
మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని, తెలుగు భాషను బ్రతికించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి కార్యదర్శి చక్రవాదనుల రెడ్డప్ప, సమన్వయకర్త రామచంద్ర రాజు, తెలంగాణ సాంస్కృతిక సారథి వెన్నెల( గద్దర్ ), నన్నపనేని రాజకుమారి, మాడుగుల నాగపని శర్మ, జస్టిస్ రమణ, జేడీ లక్ష్మీనారాయణ, గుంటూరు మేయర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నిమ్మల రామానాయుడు, ఏపీ సాంస్కృతిక సారథి కవులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.


