Breaking News

డంపింగ్ యార్డు తొలగించి అన్ని సౌకర్యాలతో నూతన స్మశాన వాటిక నిర్మించాలి

(కరీంనగర్ జిల్లా స్టాఫర్ మన ప్రగతి ప్రతినిధి)జనవరి-5

కలెక్టరేట్ ప్రజావాణిలో 50 మంది సంతకాలతో అలుగునూరు గ్రామ ప్రజల వినతి పత్రం అందజేశారు.
కరీంనగర్ జిల్లా అలుగునూరు గ్రామ ప్రజలు మానేరు వాగు తీరాన ఉన్న డంపింగ్ యార్డు వల్ల గ్రామంలో ఆరోగ్య,పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.అదే సమయంలో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కారణంగా కోల్పోతున్న పాత స్మశాన వాటికకు ప్రత్నామ్యంగా అన్ని మౌలిక సౌకర్యాలతో నూతన స్మశాన వాటిక నిర్మించాలని కోరుతూ 50 మంది సంతకాలతో నేడు కరీంనగర్ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు.ఇది రాజకీయ అంశం కాదని, గ్రామ ప్రజల ఆరోగ్యం,పర్యావరణ పరిరక్షణ,పూర్వీకుల గౌరవానికి సంబంధించిన ప్రజల సమస్య మాత్రమేనని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో
సింగం శ్రీనివాస్,కుంభాల లింగయ్య,
తమ్మనవేణి అంజి యాదవ్,లంక స్వామి,
సిరిసిల్ల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జన్నారం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు