Breaking News

ఫిష్ కాలనీలో పేదల కల సాకారం

-హామీ నిలబెట్టుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి.
-ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజల తరఫున పోరాటం తప్పదు.
-వుల్లెంగల సేవా ట్రస్ట్ అధినేత నవీన్

(కరీంనగర్ జిల్లా మన ప్రగతి న్యూస్)జనవరి-5

జన్నారం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ ఫిష్ కాలనీ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఫిష్ కాలనీ ప్రాంతంలో గుడిసెల్లో జీవిస్తున్న పేద కుటుంబాలకు ఇళ్లను నిర్మించి అందించినట్లు వుల్లెంగల సేవా ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు.భద్రత, ప్రశాంతతతో జీవించేందుకు కనీస అవసరమైన ఒక చిన్న ఇంటిని నిర్మించడం తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు.ఫిష్ కాలనీ వాసులు తమ ఇళ్ల సమస్యను వుల్లెంగల నవీన్ దృష్టికి తీసుకురావడంతో,ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి హామీని అమలు చేశామని పేర్కొన్నారు.ఆ ప్రాంతంలో ఇంకా పలు మౌలిక సమస్యలు ఉన్నాయని,వాటి పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో పేదలకు భూములు కేటాయిస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే తప్పకుండా నిలదీస్తామని హెచ్చరించారు.ప్రజల సమస్యల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని,పేదల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేను కేవలం నా తండ్రి ఆస్తులకు మాత్రమే వారసుడిని కాదు ఆయన నాటిన నైతిక విలువలు, సిద్ధాంతాలు,మాటకు కట్టుబడే స్వభావానికి కూడా వారసుడిని అని పేర్కొన్నారు. వుల్లెంగల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలంలోని ప్రతి పేదవాడికి అండగా నిలవాలనే లక్ష్యంతో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఇప్పటికే తిమ్మాపూర్ మండలం, మానకొండూర్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యల పరిష్కారం కోసం,పేదల పక్షాన నిలబడి సేవా కార్యక్రమాలు,పోరాటం కొనసాగుతాయని స్పష్టం చేశారు.ప్రజా సమస్యలే పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళతానని ఉల్లెంగుల సేవా ట్రస్ట్ అధినేత నవీన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో లో రామస్వామి,బాబా ప్రదీప్,అజయ్, నితిన్,వినయ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.