Breaking News

ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు..

మన ప్రగతి న్యూస్/సైదాపూర్:

హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి జాతీయ రహదారిపై మంగళవారం టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని ఆర్టిసి బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో సైదా పూర్ మండలం సోమవారం గ్రామానికి చెందిన గడ్డం రాజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.గమనించిన స్థానికులు 108 కి సమాచారం అందించ డంతో సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది రాజయ్యకు ప్రధమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గూడూరులో విషాదం..ట్రాక్టర్ ఇంజన్ మీద పడి విద్యార్థి మృతి..