మన ప్రగతి/గంభీరావుపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోనీ ప్రభుత్వ డీగ్రీ ప్రథమ ద్వితీయ తృతీయ విద్యార్థులకు గణిత శాస్త్రంలో ఆ విభాగాధిపతి డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి విజయలక్ష్మి అధ్యక్షతన వేబినార్ ను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు అందరూ ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత ఉద్యోగాలు పొందడానికి కృషి చేయాలని కోరారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు హాజరయ్యే విద్యార్థులకు ఈ యొక్క టాపిక్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు వేబినార్ కు రిసోర్స్ పర్సన్స్ గా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మ్యాథమెటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రవీణ్ కుమార్ హాజరై విద్యార్థులకు గణిత శాస్త్రం లోవిద్యార్థులకు నాన్ మాథమాటిక్స్ విద్యార్థులకు ప్రాథమిక సంఖ్య సిద్ధాంతం గురించి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో గణిత శాస్త్రం యొక్క ప్రాధాన్యతను వివరించారు. వీటికి సంబందించిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ లను విద్యార్థులకు అందించారు అనంతరం రిసోర్స్ పర్సన్ ఎల్ ప్రవీణ్ కుమార్ విద్యార్థుల నుండి క్వశ్చన్స్ తీసుకొని వాటికి సంబంధించిన ఆన్సర్స్ ను ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ వై ఆంజనేయులు,డాక్టర్ ఆది విష్ణు, వాణి, డాక్టర్ కే వి బిక్షమయ్య, మనోహర్, శ్రీనివాస్,కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

