(మన ప్రగతి న్యూస్ కరీంనగర్ జిల్లా స్టాఫర్) జనవరి-6
కరీంనగర్ ట్రాఫిక్ పోలీసు అధికారుల సమన్వయంతో పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులకు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి,రోడ్డు నియమాలు పాటించని యెడల చట్టపరంగా శిక్షలకు గురికావాల్సి వస్తుందని,మరియు వాహనాలు నడిపేటప్పుడు మోటారు వాహనాల చట్టంలో నిబంధనలను పాటించని యెడల రోడ్డు ప్రమాదాలకు గురై అంగవైకల్యము లేదా మరణాలు సంభవిస్తున్నాయని తెలియజేశారు.కావున విద్యార్థులు రోడ్డు నియమాలు పాటించకుండా వాహనాలు నడిపి వారి యొక్క బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని,మధ్యం తాగి వాహనాలు నడపవద్దని,ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని,చాలామంది రోడ్డు ప్రమాదాలలో హెల్మెట్ లేకపోవటం వలన తలకు గాయలై ప్రాణాలు కోల్పోతున్నారని, కచ్చితంగా ద్విచక్ర వాహనం నడుపేటప్పుడు హెల్మెట్ ధరించాలని తెలియజేశారు.మైనర్లకు ఎట్టి పరిస్థితులలో వాహనం ఇవ్వరాదని తల్లిదండ్రులకు తెలియజేశారు.వాహనం నడిపేటప్పుడు వాహనదారులు లైసెన్స్,రిజిస్ట్రేషన్ కాగితాలు,ఇన్సూరెన్స్ దగ్గర ఉంచుకోవాలని ఏ పత్రాలు లేకున్నా వాహనదారులకు జరిమానాలు తప్పవని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు రోడ్డు భద్రతపై తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్,డిప్యూటీ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తనకు మహేష్,ఎస్సై గణేష్ మరియు కళాశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

