Breaking News

బస్సులో ప్రయాణికుడికి ఫిట్స్

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం

కొండగట్టు నుంచి హుజురాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు ఫిట్స్‌తో స్పృహతప్పాడు.శంకరపట్నం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా సమీపంలో డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశారు.ఘటన స్థలంలో మొలంగూరు సర్పంచ్ పూదరి రాజు తదితరులు ఉండడంతో బాధితుడికి సపర్యలు చేసి మనోధైర్యం కల్పించారు.అనంతరం 108 వాహనంలో హుజురాబాద్ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

జన్నారం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు