Breaking News

మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

-అభ్యంతరాలను తమ దృష్టికి తీసుకురావాలి అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే.

(మన ప్రగతి న్యూస్ / కరీంనగర్ స్టాపర్:

జన్నారం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు

ఓటరు ముసాయిదా జాబితా పై అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ మునిసిపాలిటీల్లో చనిపోయిన వారి ఓటర్ల ను తొలగించాలని కోరారు.కుటుంబ సభ్యులందరికీ ఓట్లు ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఓటరు జాబితా సజావుగా నిర్వహించాలన్నారు.పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెంచాలని కోరారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే అన్ని మునిసిపాలిటీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వార్డుల వారీగా ముసాయిదా ప్రకటించామన్నారు.వినతులు స్వీకరించినట్లు పేర్కొన్నారు.మరణించిన వారి ఓట్లు,రెండు చోట్ల నమోదైన ఓట్ల సమాచారం తెలిస్తే మాకు అందించాలని సూచించారు తొలగిస్తామని పేర్కొన్నారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది ఓటరు జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చొప్పదండి, జమ్మికుంట,హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్లు నాగరాజు,అయాస్,సమ్మయ్య, రాజకీయ పార్టీల ప్రతినిధులు వై.సునీల్ రావు,నాంపల్లి శ్రీనివాస్(బిజెపి),చల్లా హరిశంకర్,సత్తినేని శ్రీనివాస్(బి ఆర్ ఎస్) మడుపు మోహన్( కాంగ్రెస్), పైడిపల్లిరాజు (సిపిఐ),మిల్కూరి వాసుదేవ రెడ్డి (సిపిఐఎం)తేజ దీప్ రెడ్డి(ఏఐఎఫ్ ఎఫ్ బి) తదితర రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.