_ జిపి వెంటనే వీటిపై చర్య తీసుకోవాలి..
మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్:
ముస్తాబాద్ మండల కేంద్రంలోని పిచ్చికుక్కలు స్వైర విహారం రోజుకు రోజు పెరిగిపోతున్నాయి, పదుల సంఖ్యలో గుంపులు గుంపులుగా తిరుగుతున్నా యి. వాటికి ఆహారం దొరకక అడవి ప్రాంతాల్లో పెరిగే వీధి కుక్కలు పట్టణంలో ప్రాంతాలలో చిరు వ్యాపారుల దగ్గర చికెన్ సెంటర్ ల వద్ద గుంపులుగా ఉండి ఆహారం కోసం ప్రజలపైకి దాడులు చేస్తున్నాయి, ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంగుతున్నారు.. రహదారిపై ప్రయాణం చేసేటప్పుడు వాహనాలపై చిన్న పిల్లలతో పాటు పెద్దవారిపై కూడా దాడులు చేస్తున్నాయి. చిన్న పిల్లలు బయట ఆడుకుంటున్న సమయంలో దాడులకు పాల్పడుతున్న క్రమంలో తల్లిదండ్రులు వారి పిల్లలను బయటకు పంపాలంటేనే భయపడుతున్నారు.. కుక్కకరిస్తే రేబిస్ వ్యాధి వల్ల ప్రాణాంతకం ముప్పు ఏర్పడుతుందని భయపడుతున్నారు, వెంటనే ముస్తా బాద్ పట్టణంలో ప్రతి వార్డులో నూతన పాలకవర్గం పర్యవేక్షించి వీధి కుక్క లను లేకుండా వాటిని అడవి ప్రాంతాల్లో ఆహారం దొరికే చోట వదిలి పెట్టాలని ప్రజల విజ్ఞప్తి చేస్తున్నారు.

